Home » Best Telugu movies on amazon prime

Best Telugu movies on amazon prime

by Janani

Best Telugu movies on amazon prime

With hundreds of Telugu movies to choose from and the sorting system that doesn’t always make the right choice easy to find, it can be challenging to know what to watch on Prime Video.

That’s why Learnly has hand-picked a few of the best Telugu movies on amazon prime to watch right now. With regular updates for films that have been removed and when new films are added, we make sure this post lists the best all the time. We’ve done the hard work, so now the only thing you have to do is sit back & enjoy the best Telugu movies.

# వకీల్ సాబ్ (Vakeel Saab)

పల్లవి, జరీనా, దివ్య అనే ముగ్గురు మధ్యతరగతి అమ్మాయిలు అనుకోని పరిస్థితుల్లో ఒక ఎంపీ కొడుకుపై దాడి చేస్తారు. ప్రజలచే మోసగించబడి, ప్రజల కోసం తన జీవితాన్ని కోల్పోయి ప్రాక్టీసు మానేసిన లాయర్ మన కొణిదల సత్యదేవ్ అలియాస్ వకీల్ సాబ్ (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్). పలుకుబడి, పదవి, అలాగే నంద (ప్రకాష్ రాజ్)లాంటి సీనియర్ మోస్ట్ లాయర్ యొక్క తెలివితేటలతో బలంగా మోపబడిన ఈ కేసువల్ల, ఆ అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఆ కేసు వాదించడానికి ఒప్పుకున్న మన వకీల్ సాబ్ వాటిని ఎలా ఎదుర్కున్నాడు?

పింక్ రిమేక్ గా వచ్చిన ఈ సినిమా, పవర్ స్టార్ పవర్ పేక్డ్ పెర్ఫార్మెన్స్ మరియు డైరెక్టర్ వేణు చేసిన మార్పులవల్ల పింక్ సినిమా యొక్క బెస్ట్ వర్షన్ గా అందరి మన్ననలు పొందింది.

Vakeel Saab (2021) 153min | Action, Drama, Thriller | 9 April 2021 (India) Summary: Drama film centers on the life of a criminal lawyer.
Countries: IndiaLanguages: Telugu

# మత్తు వదలరా (Mathu Vadalara)

రొటీన్ కధల మత్తులో ఉన్న జనాలకు మత్తు వదిలించిన సినిమా.

డెలివరీ బాయ్ గా పనిచేసే బాబు (శ్రీ సింహ), తన స్నేహితుడు ఏసుదాసు (సత్య) మాటలు విని, చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఒక క్రైమ్ లో ఇరుక్కుంటాడు. దాంట్లోంచి బయట పడ్డాడా? లేదా? అసలేం జరిగింది అనేదే కధ.

రితేష్ రానా దర్శకత్వం, కాలభైరవ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా చెప్పుకోవచ్చు.

Mathu Vadalara (2019) 130min | Comedy, Crime, Thriller | 24 December 2019 (USA) Summary: Simha is a courier delivery boy who gets peanuts as salary despite putting in a lot of hard work. As Babu gets frustrated with his job, his friend and roommate Satya shows him how to get '... See full summary »
Countries: IndiaLanguages: Telugu

# గూడచారి

తన చిన్నతనంలోనే RAW ఆఫీసర్ అయిన తన తండ్రి రఘవీర్ ని కోల్పోయిన గోపి ఎలా అయినా తను కూడా ఒక RAW ఏజెంట్గా ఎదగాలనుకుంటాడు. తన RAW గ్రాడ్యుయేషన్ రోజున జరిగే, RAW యెక్క అతిముఖ్య ఏజెంట్ లైన ఆచార్య మరియు దామోదర్ (అనీష్ కురువ్విల్లా) హత్య కేసులో గోపి ఇరుక్కుంటాడు. అసలు వాళ్లను చంపింది ఎవరు? ఎందుకు? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా డిక్లేర్ చేయబడ్డ గోపి, తనపై పడ్డ మచ్చని ఎలా చెరుపుకోగలిగాడు అనేది మన గూడచారి సినిమా తెలియచేస్తుంది.

Goodachari (2018) 147min | Action, Thriller | 2 August 2018 (USA) Summary: A young NSA agent is framed for the murder of his bosses making him realize that now his mission is darker than expected and has some personal scores to settle regarding his father's death, a former NSA agent.
Countries: IndiaLanguages: Telugu

# కపటధారి (Kapatadhari)

ఎలాగైనా క్రైమ్ డిపార్ట్మెంట్ లో పని చేయాలి అనుకుని, కష్టపడి పనిచేసే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ (సుమంత్) కి అడుగడుగునా అవమానాలే ఎదురవుతాయి. అలాంటి సమయంలోనే ఆత్మహత్య గా డిపార్ట్మెంట్ క్లోజ్ చేసిన ఒక కేసులో, ఏదో మిస్టరీ ఉందని పర్సనల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన గౌతమ్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? వాటిని అదిగమించి కేసుని చేదించగలిగాడా? తన కల నెరవేరిందా లేదా అనేదే కధ.

Kapatadhaari (2021) 136min | Crime, Drama, Thriller | 19 February 2021 (India) Summary: Gowtham, a traffic cop, investigates an unsolved murder case from the past that is out of his jurisdiction
Countries: IndiaLanguages: Telugu

# అంజలి CBI (Anjali CBI)

కొన్ని సంవత్సరాల క్రితమే సి.బి.ఐ ఆఫీసర్ అంజలి (నయనతార) క్లోజ్ చేసిన రుద్ర అనే సీరియల్ కిల్లర్ కేసు మళ్ళీ తెర మీదకు ఎలా వచ్చింది? ఎవరీ రుద్ర? చనిపోయాడు అని అనుకుంటున్న రుద్ర ఎలా తిరిగి వచ్చాడు. అడుగడుగునా అంజలి మరియు ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న రుద్ర తన పగ తీర్చుకున్నాడా లేక అంజలి పైచేయి సాదించిందా అనే విషయాల చుట్టూ కధ తిరుగుతుంది.

Imaikkaa Nodigal (2018) 170min | Action, Crime, Drama | 29 August 2018 (USA) Summary: A CBI officer goes in search of a ruthless serial killer. Things get worse when the murderer targets the former and her family.
Countries: IndiaLanguages: Tamil

# మాష్టర్ (Master)

తనకు జీవితంలో కొంతమంది చేసిన అన్యాయానికి, అబ్జర్వేషన్ హోమ్ లో ఉండే ఖైదీలను ఉపయోగించుకొని విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తుంటాడు భవాని (విజయ్ సేతుపతి). తన స్వార్థం కోసం ఎవరినైనా బలిచేసే భవానికు, తనను నమ్మినవాళ్ళ కోసం ఏదైనా చెయ్యటానికి సిద్ధపడే జే.డి (తలపతి విజయ్)మధ్య జరిగే కధ. కాలేజీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చరర్ జే.డి. కీ, అబ్జర్వేషన్ హోమ్ కి సంభంధం ఏమిటి? జే.డి, భవానీల మధ్య ఏం జరిగింది, ఎవరు గెలిచారు అనేదే మన మాష్టర్.

Master (2021) 179min | Action, Thriller | 13 January 2021 (USA) Summary: An alcoholic professor is sent to a juvenile school, where he clashes with a gangster who uses the school children for criminal activities.
Countries: IndiaLanguages: Tamil

# రాజావారు రాణిగారు (Raja Vaaru Rani Gaaru)

మోస్ట్ అండర్రేటెడ్ గా రిలీజ్ అయ్యి, చాలామంది ప్రేక్షకుల ఆదరణ పొందిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. తన ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలియక, చెప్పడానికి బయపడుతూ ఉండే ఒక పల్లెటూరి యువకుడి కథ. రాజు (కిరణ్ అబ్బవరం), తన ప్రేమని రాణికి తెలియపరిచాడా? రాజు స్నేహితులు అయిన చౌదరి, నాయిడులు ఈవిషయంలో ఎలా ఉపయోగపడ్డారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చౌదరి, నాయుడు మధ్య జరిగే సన్నివేశాలు, సంభాషణలు భలే గమ్మత్తుగా ఉంటాయి.

Raja Vaaru Rani Gaaru (2019) 133min | Romance | 29 November 2019 (USA) Summary: Raja Vaaru Rani Gaaru is the story of Raju who falls in love with Rani but is unable to express his emotions. Set in a beautiful village, watch as Raju and two of his friends deal with the toils and troubles of romance.
Countries: IndiaLanguages: Telugu

# కవచం (Kavacham)

నిజాయితీ పరుడైన ఇన్స్పెక్టర్ విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్), సంయుక్త (కాజల్ అగర్వాల్)ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ విఫలమైన సమయంలోనే అనుకోకుండా లావణ్య (మెహరీన్)ని కలుస్తాడు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, లావణ్య ఇచ్చిన ఒక సలహా వల్ల, కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు విజయ్ కిడ్నాప్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? ఆ కేసు నుండి ఎలా బయటపడ్డాడు? అనే కోణంలో ఈ కథ నడుస్తుంది.

Kavacham (2018) 141min | Action, Thriller | 6 December 2018 (USA) Summary: A police officer from Vizag finds himself in a rut when false allegations are levied against him. He has 24 hours now to prove his innocence.
Countries: IndiaLanguages: Telugu

# వెంకటాపురం (Venkatapuram)

అంచనాలేమీ లేకుండా చూడండి, బాగా నచ్చే అవకాశం ఉంది. ఇక కథలోకి వెళ్తే, భీమిలి బీచ్ లో దొరికిన శవం దగ్గర నుండి మొదలు అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో చనిపోయింది కాలేజీ స్టుడెంట్ చైత్ర(మహిమ) అని, పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేసే ఆనంద్ (రాహుల్) మీద అనుమానం వ్యక్తం చేస్తాడు పోలీసు అధికారి దుర్గాప్రసాద్ (అజయ్ ఘోస్). అసలేం జరిగింది? అసలు ఆ మర్డర్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఆనందే దోషి అని ని‌రూపించగలిగారా? లేక ఆనంద్ నిర్దోషిత్వాన్ని నిరుపించుకుంటాడా?
(స్క్రీన్-ప్లే కొంచెం స్లోగా ఉంటుంది)

Venkatapuram (2017) 103min | Thriller
Director: Venu MadikantiWriter: Venu MadikantiStars: Abhi, Ajay, Deva
Summary: A police investigator delves into the mystery surrounding the murder of a young college girl.
Languages: Telugu

Click “Best Telugu movies on amazon prime” for the english version of this post.

Related Articles

Leave a Comment